Mumbai: ముంబైలో భవనం కూలిన ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు..

Mumbai: ముంబైలో భవనం కూలిన ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు..
X
Mumbai: ముంబై కుర్లాలో సోమవారం రాత్రి కూలిన భవనం ఘటనలో మృతుల సంఖ్య 17కు పెరిగింది.

Mumbai: ముంబై కుర్లాలో సోమవారం రాత్రి కూలిన భవనం ఘటనలో మృతుల సంఖ్య 17కు పెరిగింది. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరగగా..అప్పటి నుంచి యుద్ధ ప్రతిపాదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. గాయపడిన వారిని సమీప హాస్పిటల్‌కు తరలించారు. ఘటన జరిగిన స్థలంలో అగ్నిమాపక దళాలు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కూలిన భవనానికి పక్కనే ఉన్న బిల్డింగ్ కూడా శిథిలావస్థలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులోని వారిని ఖాళీ చేయించారు.

Tags

Next Story