మహాప్రసాదం తిని ఆస్పత్రి పాలైన 1700 మంది భక్తులు..

మహాప్రసాదం తిని ఆస్పత్రి పాలైన 1700 మంది భక్తులు..
దేవుని ప్రసాదం అంటే వెనుకా ముందూ ఆలోచించకుండా తినేస్తారు ఎవరైనా. పాపం వాళ్లు కూడా అలానే చేశారు.. కానీ ఆ ప్రసాదమే వారి ప్రాణాలకు ప్రమాదంగా మారింది.

దేవుని ప్రసాదం అంటే వెనుకా ముందూ ఆలోచించకుండా తినేస్తారు ఎవరైనా. పాపం వాళ్లు కూడా అలానే చేశారు.. కానీ ఆ ప్రసాదమే వారి ప్రాణాలకు ప్రమాదంగా మారింది. మహాప్రసాదం తిని 1700 మంది భక్తులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్ర (Maharashtra) లోహా తాలూకాలోని కోస్తాయాచి వాడి వద్ద రెండు రోజులుగా సంత బాలు మామా వారోత్సవాలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మంగళవారం ఏకాదశి సందర్భంగా భాగర్, అంటీ మహాప్రసాదాలు జరిగాయి.

నాలుగు వేల మంది భక్తులు ఈ ప్రసాదాన్ని తీసుకోగా అందులో 1745 మంది భక్తులు విషజ్వరానికి గురయ్యారు. ప్రసాదం తిన్న వారికి వికారం, వాంతులు రావడంతో భక్తులను లోహాలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అయితే రోగుల సంఖ్య పెరుగుతుండడంతో అహ్మద్‌పూర్, నాందేడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రైవేట్ వాహనాల ద్వారా రోగులు కూడా చేరుతున్నారు. దీంతో ఆస్పత్రిలో భారీగా జనం కనిపించారు.

రోగులలో సావర్‌గావ్, కోష్టాచివాడి, హరన్‌వాడి, రిసాన్‌గావ్, పెండు, మురంబి తదితర గ్రామాలకు చెందిన భక్తులు ఉన్నారు. ప్రస్తుతం విషజ్వరాలతో బాధపడుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. జిల్లా కలెక్టర్ అభిజిత్ రౌత్ దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.

విషజ్వరాలు రావడంతో గ్రామస్తులు లోహ ఆసుపత్రిలో చేరినా రోగుల సంఖ్య పెరుగుతుండడంతో నాందేడ్‌లోని ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అర్థరాత్రి విషప్రయోగం సంఘటన తర్వాత కలకలం రేగింది.

ప్రసాదం ఎప్పుడు చేశారు.. ఎలాంటి వాతావరణంలో చేశారు.. లేదంటే ఎదైనా విషప్రయోగం జరిగిందా అనే కోణంలో ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Next Story