Indian Passengers : టర్కీలో చిక్కుబడిన 200 మంది భారతీయులు

లండన్ నుంచి ముంబైకి బయలుదేరిన అట్లాంటిక్ విమానం టర్కీలోని దియార్ బాకిర్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సుమారు 200 మందికి పైగా భారతీయ ప్రయాణికులు అక్కడ చిక్కుకుపోయారు. 20 గంటలకు పైగా అక్కడే ఉండిపోయారు. విమానంలోని ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో టర్కీ ఎయిర్పోర్ట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ క్రమంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో అక్కడి నుంచి టేకాఫ్ కాలేకపోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి విమాన సిబ్బంది సరిగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఆ విమానంలోని ప్రయాణికులు ఖాళీగా ఉన్న చిన్న టెర్మినల్ బిల్డింగ్ లో వేచి ఉన్నారు. చిన్న పిల్లలు, మహిళలతోపాటు అనా రోగ్యంతో బాధపడుతున్న వారు కూడా ప్రయాణికుల్లో ఉన్నారు. భారతీయ ప్రయాణికులలో ఎక్కువగా మహారాష్ట్రకు చెందిన వారే ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com