KBC : రూ.కోటి గెలిచేశాడు.. కేబీసీ షోలో అదరగొట్టిన 22 ఏళ్ల కుర్రాడు

KBC : రూ.కోటి గెలిచేశాడు.. కేబీసీ షోలో అదరగొట్టిన 22 ఏళ్ల కుర్రాడు
X

‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’.. పరిచయం అక్కర్లేని టీవీ షో ఇది. ఎన్నో సీజన్ల నుంచి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంటున్నదీ షో. బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహిస్తున్నారు. తాజాగా 16వ సీజన్‌ నడుస్తోంది. ఇందులో 22 ఏళ్ల కుర్రాడు చందర్‌ ప్రకాశ్ సంచలనం సృష్టించాడు. ఏకంగా రూ.కోటి గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో రూ.కోటి గెలిచిన తొలి కంటెస్టెంట్‌ ఇతడే కావడం విశేషం. అయితే, రూ.7 కోట్ల ప్రశ్నకు కూడా సమాధానం తెలిసినప్పటికీ.. రిస్క్‌ తీసుకోకుండా గేమ్‌ నుంచి క్విట్‌ అయ్యాడు.

Tags

Next Story