Internet Shutdown : హరియాణాలో 24గంటలు ఇంటర్నెట్ బంద్

Internet Shutdown : హరియాణాలో 24గంటలు ఇంటర్నెట్ బంద్
X

హరియాణాలో నేడు జరగనున్న బ్రజ్ మండల్ జలాభిషేక్ యాత్ర దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపేసింది. గత ఏడాది జులై 31న ఇదే యాత్ర హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇద్దరు హోంగార్డులు మరణించారు. ఈ నేపథ్యంలో నేటి యాత్రకు భారీగా భద్రతాబలగాలు రంగంలోకి దిగాయి. డ్రోన్లతో నిఘా వేయనున్నాయి. దుష్ప్రచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకే నెట్ ఆపేసినట్లు ప్రభుత్వం వివరించింది.

Tags

Next Story