Maharastra : రన్నింగ్ బస్సులో మంటలు

Maharastra : రన్నింగ్ బస్సులో మంటలు
25 మంది సజీవ దహనం

మహారాష్ట్రలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రన్నింగ్‌ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 25 సజీవ దహనం కాగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి కావడం, ప్రమాణంలో ప్రయాణీకులు నిద్రలో ఉండటం తో భారీ ప్రాణ నష్టం జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నాగ్​పుర్​​ నుంచి పుణెకు 33 ప్రయాణికులతో వెళ్తోంది. సరిగ్గా బుల్దానలో సమృద్ది మహామార్గ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై వెళ్తుండగా రాత్రి 2 గంటల సమయంలో






ఒక్కసారిగా టైరు పేలిపోయింది. వాహనం అదుపు తప్పింది. ముందుగా పక్కన ఉన్న స్తంభాన్ని, ఆ తర్వాత డివైడర్​ను ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి కావడంతో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే అనేక మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం గురించి తెలుసుకున్న కొందరు స్థానికులు సైతం అధికారులకు తమవంతు సాయం అందించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో బస్సు పూర్తిస్థాయిలో కాలిపోయింది. సగం కాలి, చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది.

ఈ ఘటనలో బస్సు డ్రైవర్​ ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు చెబుతున్నారు. గాయపడిన వారిని బుల్ధానా సివిల్ ఆసుపత్రికి తరిలించి వైద్యసేవలు అందిస్తున్నట్టు తెలిపారు.

నిత్యం వందల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చే బస్సులు అనుకోని ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఆర్టీసీ అందుబాటులో లేనప్పుడు దూరప్రయాణాలకు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఎన్నుకుంటారు. ఇవి కూడా రాత్రి,పగలు తేడాలేకుండా ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రైవేట్ బస్సు టికెట్లు లభించే అవకాశం ఉండడంతో ఈ ప్రయాణం ప్రజలకు అనుకూలమైనదిగా మారిపోయింది. కానీ ఇలా ఊహించని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం ఈ బస్సులు ఎంతవరకు సేఫ్టీ అన్న మాట మళ్ళీ చర్చకు వస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story