Coronavirus: కేరళను వణికిస్తున్న కరోనా మహమ్మారి..

కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి కేరళకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజురోజుకు కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో.. ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం ఆందోళనకు గురవుతుంది. ఒక్క మే నెలలోనే కేరళలో 182 కొవిడ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. అత్యధికంగా కొట్టాయం జిల్లాలో 57 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఎర్నాకుళంలో 34, తిరువనంతపురంలో 30 కేసులు ఉన్నట్లు చెప్పారు. కేరళలో కొవిడ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత లక్షణాలతో బాధపడేవారు తప్పసరిగా మాస్క్ ధరించాలని వీణా జార్జ్ అన్నారు.
మరోవైపు మహారాష్ట్రలో జనవరి నుంచి ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసుల్లో ఇద్దరు మరణించినట్లు నిన్న ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరణించిన వారిలో ఒకరికి క్యాన్సర్ ఉన్నట్లు పేర్కొంది. జనవరి నుంచి మొత్తం 6,066 స్వాబ్ టెస్ట్లు చేయగా, 106 కేసులు పాజిటివ్ తెలినట్లు చెప్పింది. వీరిలో 101 మంది ముంబయికి చెందిన వారు కాగా, మిగిలిన వారు పుణె, థానే, కొల్హాపుర్ చెందినవారుగా పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 52 కేసులు పాజిటివ్ కేసులు ఉన్నట్లు, వారిలో 16మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా ఆరోగ్యశాఖ చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com