Capgemini CEO : వారానికి 47.5గంటల పని.. క్యాప్ జెమిని సీఈవో ప్రకటన

ఉద్యోగుల పని గంటల విషయంలో ప్రముఖులు చేసిన వ్యాఖ్యలతో దేశంలో దీనిపై భారీగా చర్చ జరిగింది. తాజాగా క్యాప్ జెమినీ సీఈఓ కూడా పని గంటలపై స్పందించారు. నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్ షిప్ ఫోరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజుకు 9.30 గంటల చొప్పున వారానికి 5 రోజులు పనిచేస్తే చాలాని ఆయన స్పష్టం చేశారు. ఈ ఫోరంలో ఉద్యోగి వారానికి ఎన్ని గంటలు పని చేయాలని కోరుకుంటున్నారన్న ప్రశ్న వచ్చింది. దీనికి స్పందించిన ఆయన వారానికి ఐదు రోజుల పనితో రోజుకు 9.30 గంటలు పని చేస్తే సరిపోతుందని, వారంతంలో ఈ-మెయిల్స్ పంపించవద్దని, నాలుగు సంవత్సరాలుగా తాను ఇదే సూత్రాన్ని పాటిస్తున్నానని చెప్పారు. కొన్ని సార్లు వారాంతాల్లోనూ తాను పని చేస్తానని చెప్పారు. ఇలాంటి సమయంలో ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపించనని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాస్కామ్ ఛైర్పర్సన్ సింధుగంగాధరన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పని వేళల కంటే ఉత్పాదక ముఖ్యమ న్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారత్లోని యువత వారినికి 70 గంటల పాటు పని చేయాలని ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. వారానికి 90 గంటలు పని చేయాలని ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరి వ్యాఖ్యాలపై పెద్ద దుమారమే చెలరేగింది. ఈ ప్రతిపాదనలపై భారీగా చర్చ జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com