Maoists Surrender : ఛత్తీస్ గఢ్ లో 50 మంది మావోయిస్టులు లొంగుబాటు

Maoists Surrender : ఛత్తీస్ గఢ్ లో 50 మంది మావోయిస్టులు లొంగుబాటు
X

నిషేధిత మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 50 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు బీజాపూర్ డీఐజీ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భీజాపూర్, దంతేవాడ, సుక్మా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు దండకారణ్యంలోని ప్రజల కోసం చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ ప్రశాంత జీవనం గడపడానికి పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టుల కోసం చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పీఎల్బీఏ బెటాలియని కి చెందిన కీలక నేతలతో పాటు, వివిధ హోదాల్లో పనిచేస్తున్న 50 మంది మావోయిస్టు సభ్యులు తమ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ఆయన తెలిపారు.

లొంగిపోయిన మావోయిస్టులు 68 లక్షల రూపాయల రివార్డు కలిగి ఉన్నారని, వారందరికీ రివార్డు అందజేసినట్లు తెలిపారు. అలాగే గత సంవత్సరం 654 మావోయిస్టులను అరెస్టు చేసినట్లు, 346 మంది లొంగిపోయినట్లు, ఈ సంవత్సరం జనవరి 1 నుండి ఇప్పటివరకు 141 మంది మావోయిస్టులు వివిధ ఎన్ కౌంటర్లో మరణించారని తెలిపారు. లొంగిపోయి సమాజ స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు ఒక్కొక్కరికి 25 వేల రూపాయల చెక్కును అందించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 222వ బెటాలియన్ కమాండెంట్ వీరేంద్ర సింగ్, 85వ బెటాలియన్ కమాండెంట్ సునీల్ కుమార్ రాహి, 153వ బెటాలియన్ కమాండెంట్ అమిత్ కుమార్, 168వ బెటాలియన్ కమాండెంట్ విక్రమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Next Story