Chamba accident: కారును ఢీకొట్టి లోయలో పడిన కారు .. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం

Chamba accident:  కారును ఢీకొట్టి లోయలో పడిన కారు .. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం
X
హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోరు రోడ్డు ప్రమాదం

హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోరు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఒకే కుటుంబానికి ఆరుగురు మృతిచెందారు. రాజేష్‌ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఛన్వాస్‌ ప్రాతంలో కొండపై నుంచి పడిన ఓ రాయి కారును ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన కారు 500 మీటర్ల లోతున్న లోయలో పడింది. ఈ ఘటనలో రాజేష్‌, హన్సో (36) దంపతులు, వారి కుమార్తె ఆర్తి (17), కుమారుడు దీపక్‌ (15), బావమరిది హిమరాజ్‌, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.

కారులో ఆరుగురు ఉన్నట్లు తమకు సమాచారం అందిందని చంబా ఎస్పీ అభిషేక్‌ యాదవ్‌ తెలిపారు. వారంతా ఘటనా స్థలంలోనే మృతిచెందారన్నారు. హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు స్థానికులతో కలిసి మృతదేహాలను వెలికి తీశారన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కాగా, రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందడంపై హిమాచల్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags

Next Story