Delhi: ఢిల్లీలో కూలిన గోడౌన్ గోడ.. ఆరుగురు మృతి..

X
Delhi: ఢిల్లీలో గోడౌన్ గోడ కూలి ఆరుగురు మృతిచెందారు. ఈ ఘటన అలీపూర్ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోగా.. తొమ్మిది మందికి గాయాలయ్యాయి. గోడౌన్ శిథిలాల కింద పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు మూడు మృతదేహాలను వెలికి తీశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
