Kumbh Mela : మహా కుంభమేళాలో 62 కోట్ల మంది పుణ్యస్నానాలు

Kumbh Mela : మహా కుంభమేళాలో 62 కోట్ల మంది పుణ్యస్నానాలు
X

త్రివేణి సంగమ క్షేత్రమైన ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా కొనసా గుతోంది. ఇప్పటి వరకు 62 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మహాశి వరాత్రి పర్వదినం సందర్భంగా ఈ నెల 26న చివరి రాజస్నానంతో కుంభమేళా పరిపూర్ణం కానుంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో కుంభమేళాపై తప్పుడు ప్రచారం చేస్తున్న 140 సోషల్ మీడియా హ్యాండిల్స్ పై యూపీ పోలీసులు కొరడా ఝు ళిపించారు. వాస్తవాలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై 13 ఎఫ్ఎస్ఐఆర్ లు నమోదు చేసినట్టు ప్రయాగ్ రాజ్ డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. శివరాత్రి రోజు చివరి రాజస్నానంతో కుంభ మేళా ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్ రాజ్ కు భక్తుల తాకిడి పెరిగింది. శివరాత్రి సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు డీఐజీ తెలిపారు.

వారణాసి, అయోధ్యలోనూ..

మహాశివరాత్రి, కుంభమేళా ముగింపు సందర్భంగా ప్రయాగ్ రాజ్ వచ్చే భక్తులు సమీపంలోని అయోధ్య, వారణాసికి వెళ్లే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ట్రాఫిక్ జామ్ లను నియంత్రించేందుకు ఇప్పటి నుంచే వ్యూహరచన మొదలైంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని అదనంగా భద్రతా సిబ్బందిని నియమించామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.

Tags

Next Story