Padma Awards : 68 మందికి పద్మ అవార్డులు ప్రదానం.. పద్మశ్రీ అందుకున్న మందకృష్ణ

రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మందకృష్ణ మాదిగ, కెఎల్ కృష్ణ, వదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి తదితరులు పద్మ అవార్డులు అందుకున్నారు. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌరసేవ వంటి విభిన్న రంగాలలో విశేష సేవలు అందించిన వారికి పౌర పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.
మొత్తం 139 మందిని కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఏడు పద్మ విభూషణ్, 19 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. మొదటి విడతలో భాగంగా 71 మంది ప్రముఖులకు ఈ అవార్డులను రాష్ట్రపతి అందజేశారు. రెండవ విడతలో భాగంగా 68 మందికి పద్మ పురస్కారాలు అందజేశారు. మంగళవారం ముగ్గురు పద్మ విభూషణ్ పురస్కారం అందుకోగా.. మరో తొమ్మిది మంది పద్మభూషణ్ అవార్డును తీసుకున్నారు. అలాగే మరో 56 మంది పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com