Central Government : 72శాతంమంది భారతీయులకు హెచ్1బీ వీసా: కేంద్రం

Central Government : 72శాతంమంది భారతీయులకు హెచ్1బీ వీసా: కేంద్రం
X

2022 అక్టోబర్ -2023 సెప్టెంబర్ మధ్యకాలంలో 72.3శాతంమంది భారతీయులకు హెచ్1బీ వీసాలు జారీ అయ్యాయని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో తెలిపింది. ‘ద్వైపాక్షిక చర్చల ద్వారా హెచ్1బీ వీసా గురించి అమెరికా ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. యుద్ధం మొదలుకావడానికి ముందు 21,928మంది భారత విద్యార్థులు ఉక్రెయిన్‌లో ఉన్నారు. గత ఏడాది నవంబరు సమయానికి ఆ సంఖ్య 1802కు చేరింది. ఇక ఇజ్రాయెల్‌లో 900మంది విద్యార్థులున్నారు’ అని వివరించింది.

అమెరికాకు వెళ్లిన స్టూడెంట్స్ పార్ట్ టైమ్ జాబ్స్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆస్ట్రేలియాకు వెళ్లిన స్టూడెంట్స్‌ పరిమితికి మించి పార్ట్ టైమ్ జాబ్స్ చేసి ఇబ్బందులపాలవుతున్నారు. ఇలా చేయడంతో విద్యార్థుల వీసాలు రద్దవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన నోటీసులను Xలో షేర్ చేస్తున్నారు. అక్కడ స్టూడెంట్స్ 15 రోజుల్లో 48గంటల కంటే తక్కువ సేపు మాత్రమే పనిచేయాలి.

Tags

Next Story