భారత్‌లో కొత్త‌గా 78,357 కరోనా పాజిటివ్ కేసులు

భారత్‌లో కొత్త‌గా 78,357 కరోనా పాజిటివ్ కేసులు
భారత్‌లో‌ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 78,357 కేసులు నమోదు కాగా..

భారత్‌లో‌ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 78,357 కేసులు నమోదు కాగా, 1045 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 62,026 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశంలో మొత్తం 37,69,530 కేసులు నమోదయ్యాయి, 66,333 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 8,01,282 ఉండగా, 29,01,908 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటలలో దేశ వ్యాప్తంగా 10,12,367 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 4,43,37,201 పరీక్షలు నిర్వహించారు.

Tags

Next Story