Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ప్రైవేట్ బస్సు ఢీ.. 9 మంది మృతి..
Karnataka: కర్ణాటక హుబ్లీ శివారులో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
BY Divya Reddy24 May 2022 8:50 AM GMT

X
Divya Reddy24 May 2022 8:50 AM GMT
Karnataka: కర్ణాటక హుబ్లీ శివారులో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ప్రైవేట్ బస్సు ఢీ కొన్న ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు చికిత్స పొందుతు చనిపోయారు. ప్రమాదంలో 26 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుబ్లీలోని హాస్పిటల్‌కు తరలించారు. చనిపోయిన వారిలో లారీ డ్రైవర్, క్లీనర్ కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు. బస్సు మహారాష్ట్రలోని కొల్హాపూర్ నుంచి బెంగళూరు వస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story