కొవిడ్‌తో కొత్తగా 986 మంది మృతి

కొవిడ్‌తో కొత్తగా 986 మంది మృతి

భారత్‌లో కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 72 వేల 49 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 67 లక్షల 57 వేల 132కి చేరింది. మరోవైపు కొవిడ్‌తో 986 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య లక్షా 4 వేల 555 కి పెరిగింది. ఇక నిన్న ఒక్క రోజే 82 వేల 203 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 57 లక్షల 44 వేల 693కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9 లక్షల 7వేల 883 యాక్టివ్‌ కేసులున్నాయి. దేశంలో రికవరీ రేటు 85.02 శాతంగా ఉండగా.... మరణాల రేటు 1.55 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Tags

Next Story