దేవుడా నీకు నేనున్నా…

దేవుడా నీకు నేనున్నా…
తమిళనాడు తెన్‌కాశీ జిల్లా సెంగోటై ప్రాంతంలో విచిత్ర ఘటన

ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడు దిక్కు అంటారు కానీ ఓ కాకి మాత్రం, దేవుడికి ధైర్యం చెబుతోంది. గుడికి ఎవరు రావట్లేదా అయినా ఏం పర్వాలేదు నీకు నేనున్నాను స్వామి, అంటూ గుడికి వచ్చి గంట కొట్టి వెళుతోంది. తమిళనాడు సంగోటై సమీపంలోని వినాయకస్వామి ఆలయంలో ఓ కాకి గంటను మోగిస్తుండడం స్థానికంగా చర్చనీయాంశమైంది. తెన్‌కాశీ జిల్లా సెంగోటై సమీపంలోని చెరువు వద్ద గణేశుని ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని బుధ, శనివారాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే భక్తులు సందర్శిస్తారు. అందుకే పూజారి కూడా ఈ రెండు రోజులు మాత్రమే ఆలయానికి వచ్చి పూజలు చేస్తుంటారు.

అయితే మిగిలిన రోజుల్లో అసలు జన సంచారమే లేని ఆ ప్రాంతంలో ఓ కాకి గంట కొడుతుండాడాన్ని స్థానికులు గుర్తించారు. ధూపదీప నైవేద్యాలు లేని రోజుల్లో ఓ కాకి వచ్చి గంట మోగించి వెళ్లడాన్ని గమనించారు. పూజలు జరిగే ఆ రెండు రోజులు కాకుండా మిగిలిన ఐదు రోజులు ఉదయం 7 గంటలకు, సాయంత్రం 5 గంటలకు గుడి ముందు గంటను కాకి మోగిస్తోందని తెలిపారు. మొదట్లో వారు కూడా ఈ విషయం పెద్దగా పట్టించుకోలేదు. మొదటి సారి చూసినప్పుడు కాకి అప్పుడప్పుడు గంట కొట్టి వెళుతుంది అని మాత్రమే అనుకున్నారు అయితే కాస్త పరిశీలించిన తర్వాత వారంలో పూజలు జరగని ఐదు రోజులు మాత్రమే కాకి వచ్చి గంట కొట్టడం గమనించామన్నారు. ఇప్పుడు ఈ దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్దఎత్తున వస్తున్నారని తెలిపారు.

గతంలో ఒక శివాలయంలో పంది, వినాయకుడి ఆలయంలో ఎలుక ప్రదక్షిణలు చేసి వార్తలలో నిలిచాయి.

మనసులో భక్తి, విశ్వాసం, నింపుకొని చేసే ఏ పని అయినా మనకి ప్రశాంతతనే కాదు ముక్తి ని కూడా ఇస్తుంది. అయితే జంతువులకు ఇలాంటివి ఉండవు కానీ అవి ప్రదక్షిణలు చెయ్యడం లేదా ఇలా గంట కొట్టడం వంటివి మాత్రం చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు.

Tags

Read MoreRead Less
Next Story