Udaipur: నుపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్.. నడిరోడ్డుపై తల నరికి హత్య.. ఆపై వీడియో తీసి..
Udaipur: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ మాల్డాస్ స్ట్రీట్‌లో దారుణం జరిగింది.

Udaipur: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ మాల్డాస్ స్ట్రీట్‌లో దారుణం జరిగింది. నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌ను షేర్ చేసిన వ్యక్తిని ఇద్దరు ఆగంతకులు దారుణంగా హతమార్చారు. కత్తులతో దాడిచేస్తూ.. వ్యక్తి తల నరికి చంపారు. దారుణానికి పాల్పడిన అనంతరం దుండగులు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చర్యను గొప్పగా చెప్పుకుంటూ కత్తిచూపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
అటు హత్య ఘటనతో ఉదయ్‌పూర్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. దారుణ ఘటనను నిరసిస్తూ మాల్డాస్ స్ట్రీట్‌లో నిరసనకు దిగారు. వ్యాపారులు షాప్‌లు మూసివేసి బంద్ పాటించారు. హత్య ఘటనతో అప్రమత్తమైన పోలీసులు కట్టు దిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అదనంగా 600 మంది భద్రతా సిబ్బందిని ఉదయ్‌పూర్‌లో మోహరించారు. అటు ఇంటర్నెట్ సేవల్ని అధికారులు నిలిపి వేశారు. నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
RELATED STORIES
TS High Court : తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జిలు
12 Aug 2022 5:13 PM GMTRajagopal Reddy : మునుగోడు ఫలితం.. కేసీఆర్ పతనం : రాజగోపాల్ రెడ్డి
12 Aug 2022 2:20 PM GMTKhammam : డిఆర్ఎఫ్ సిబ్బంది మృతి.. అధికారుల బలవంతం వల్లే నీళ్లల్లోకి...
12 Aug 2022 2:07 PM GMTKishan Reddy Rakhi : కానిస్టేబుళ్లకు రాఖీ కట్టిన కేంద్రమంత్రి...
12 Aug 2022 12:43 PM GMTKCR Rakhi : రాఖీ కట్టించుకొని ఆశీర్వాదం తీసుకున్న సీఎం కేసీఆర్..
12 Aug 2022 12:17 PM GMTTRS Munugodu : ఆరోజు మునుగోడులో కేసీఆర్ బహిరంగ సభ..
12 Aug 2022 11:00 AM GMT