Pranab Daughter : మన్మోహన్‌కు స్మారకమా? మరి నా తండ్రికెందుకు అడగలేదు: ప్రణబ్ కుమార్తె

మన్మోహన్ సింగ్ ప్రత్యేక స్మారకం కోసం పీఎం మోదీని ఖర్గే కోరడాన్ని ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠ విమర్శించారు. పార్టీకి సేవలందించి, రాష్ట్రపతిగా పనిచేసిన తన తండ్రి చనిపోతే వాళ్లు స్మారకమే అడగలేదన్నారు. కనీసం సీడబ్ల్యూసీ మీటింగ్ పెట్టి సంతాపం ప్రకటించలేదని ఆరోపించారు. ఇవన్నీ ప్రధానులకే అని ఒకరు చెప్పగా కేఆర్ నారాయణన్‌కు సీడబ్ల్యూసీ సంతాపం ప్రకటించడాన్ని తన తండ్రి డైరీస్ ద్వారా తెలుసుకున్నానని గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2020లో కన్నుమూశారు. ఆ సమయంలో ఆయనకు నివాళులర్పించేందుకు సీడబ్ల్యూసీ సమావేశం కూడా ఏర్పాటుచేయలేదని శర్మిష్ఠా పేర్కొన్నారు. ఈవిషయంలో కాంగ్రెస్ తనను తప్పుదోవ పట్టించిందని కూడా ఆరోపించారు. రాష్ట్రపతులకు ఆ సంప్రదాయం పాటించడం లేదని కాంగ్రెస్‌లోని ఓ సీనియర్ నేత తనకు చెప్పారన్నారు. అయితే.. తన తండ్రి డైరీని చదివితే అది నిజం కాదని తెలిసిందన్నారు. రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్‌కు నివాళులర్పించేందుకు సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించినట్లు అందులో ఉందని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com