Golden Temple: గోల్డెన్ టెంపుల్‌లో యువకుడి మృతి.. చోరీకి ప్రయత్నించాడని..

Golden Temple (tv5news.in)
Golden Temple: పంజాబ్ అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. స్వర్ణ మందిరంలోకి చొరబడిన ఓ ఆగంతకుడు పవిత్ర స్థలంలోని కత్తిని తీసుకుని గురుగ్రంథ్ సాహిబ్ వైపు వెళ్లబోయాడు. అలర్ట్ అయిన శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అడ్డుకున్నారు.
వెంటనే ఆ యువకుడిపై అక్కడున్న భక్తులు దాడికి దిగారు. భక్తుల దాడిలో తీవ్రంగా గాయపడిని ఆగంతకుడు అక్కడికక్కడే చనిపోయాడు. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. భక్తులంతా సంయమనం పాటించాలని పోలీసులు సూచించారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామన్నారు. ఆగంతకుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు.
ఘటనపై తీవ్రంగా స్పందించారు పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్ని. ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి..ఆగంతకుడి వెనుక ఉన్న కుట్రదారులేవరో కనిపెట్టాలన్నారు. SGPC ప్రెసిడెంట్‌తోనూ ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందన్నారు. ఈ ఘటనతో గోల్డెన్ టెంపుల్ దగ్గర సెక్యూరిటీ పెంచారు. పరిస్థితులు అదుపులో ఉన్నాయన్నారు పోలీసులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com