Aam Aadmi Party Demands : ఇండియా కూటమిలో కాంగ్రెస్ వద్దు : ఆమ్ ఆద్మీ పార్టీ

Aam Aadmi Party Demands : ఇండియా కూటమిలో కాంగ్రెస్ వద్దు : ఆమ్ ఆద్మీ పార్టీ
X

ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీని దూరంగా పంపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఢిల్లీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చీపురు పార్టీ నుంచి వచ్చిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. మాకెన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆప్ నేత సంజయ్ సింగ్ స్పందిస్తూ.. ' ఢిల్లీ ఎన్నిక ల్లో బీజేపీ లాభం చేకూరేందుకు కాంగ్రెస్ అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ బీజేపీ స్క్రిప్టట్ను చదివారు. ఆయన హద్దులు దాటి మా పార్టీ కన్వీనర్ అరవింద్ కే జీవాల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 24 గంటల్లో పార్టీ ఆయనపై చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ను తప్పిం చేందుకు ఇతర పార్టీలతో మాట్లాడతాం' అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమితో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే కేజ్రివాల్ ప్రకటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఆప్ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2013లో 40 రోజుల పాటు ఆపనకు మద్దతివ్వడం కాంగ్రెస్ చేసిన అతి పెద్ద తప్పిదమన్నారు. అందువల్లే ఢిల్లీలో కాంగ్రెస్ బలహీనపడిందని, తాము చేసిన ఆ పొరపాటును ఇప్పటికైనా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నా రు. దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, మౌలిక సదుపా యాల కల్పనలో విఫలమయ్యాయంటూ ఆప్, బీజేపీలపై అజయ్ మాకెన్ ధ్వజమెత్తారు. ఈ కామెంట్లు చీపురు పార్టీలో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో ఏం జరు గబోతోందనే ఆసక్తి నెలకొంది.

Tags

Next Story