Arvind Kejriwal : జైలు నుంచి కేజ్రీవాల్ రిలీజ్.. ఆప్ సంబరాలు

Arvind Kejriwal : జైలు నుంచి కేజ్రీవాల్ రిలీజ్.. ఆప్ సంబరాలు
X

ఢిల్లీ లిక్కర్‌ కేసులో బెయిల్‌ రావడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రిలీజ్‌ అయ్యారు. ఢిల్లీ తీహార్‌ జైలులో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఆరు నెలల తర్వాత జైలు నుంచి రిలీజ్‌ అయిన కేజ్రీవాల్ కు స్వాగతం పలికారు. ఆప్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు భారీ ఎత్తున కార్యకర్తలు వచ్చారు. కేజ్రీవాల్‌కు జైలు ఎదుట పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్వాగతం పలికారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ఈ ఏడాది మార్చి 21న అరెస్టు అయ్యారు. జూన్ 26న తిహార్ జైలు నుంచి సీబీఐ అరెస్ట్ చేసింది. దాదాపు ఆరు నెలల పాటు కేజ్రీవాల్‌ తిహార్‌ జైలులో ఉన్నారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ భూన్యా ఇద్దరూ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేశారు. సీబీఐ కేసులో దీనికి ముందు, ఈడీకి సంబంధించిన కేసులో కేజ్రీవాల్ సుప్రీంకోర్టు నుండి బెయిల్ కూడా పొందారు. మొత్తానికి ఆప్ లో జోష్ కనిపిస్తోంది.

Tags

Next Story