AAP : 21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీకి అనుమతివ్వండి.. ఆప్ ఎంపీ చద్దా సూచన

ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. యువ భారత్ కు యువ రాజకీయ నాయకులు ఎంతో అవసరమన్నారు. ఈ మేరకు రాజ్యసభలో ఆయనొక ప్రతిపాదన చేశారు.
'యువ భారతం మనది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే 25 ఏళ్లు ఉండాలనే నిబంధన ప్రస్తుత కాలానికి సరిపోదు. ప్రస్తుతం దేశ జనాభాలో 50 శాతం మంది ప్రజలు 25 ఏళ్ల లోపువారే ఉన్నారు. ఇక 65 శాతం జనాభా 35 ఏళ్ల లోపు వారే. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక మొదటి లోక్ సభ ఎన్నికైనప్పుడు 26 శాతం మంది సభ్యులు 40 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గలవారే. ఇక గత ఎన్నికల్లో 40ఏళ్లలోపు వారు 12శాతం మంది మాత్రమే ఎన్నికయ్యారు. యువ భారత్ కు యువ రాజకీయ నాయకులు ఎంతో అవసరం. అందుకే ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలి. ఇదే కేంద్ర ప్రభుత్వానికి నా సూచన. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను' అని రాఘవ్ చద్దా పేర్కొన్నారు.
దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా వస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com