Delhi CM : అతిశీ డమ్మీ సీఎం.. ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్

ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఆప్ నాయకురాలు, మంత్రి అతిశీపై ( Atishi ) ఆ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్ ( Swati Maliwal ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ కొత్త సీఎంగా అతిశీ ఎంపికైన సంగతి తెలిసిందే.మంగళవారం జరిగిన ఆప్ శాసనసభాపక్ష నేతల సమావేశంలో ఆమె పేరును ఏకగీవ్రంగా ఆమోదించారు. అయితే, ఈ నిర్ణయంపై పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆతిశీ ‘డమ్మీ సీఎం’ అంటూ మండిపడ్డారు. ‘ఢిల్లీకి ఇది విచారకరమైన రోజు. ఉగ్రవాది అఫ్జల్ గురును కాపాడేందుకు యత్నించిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించారు. అఫ్జల్ గురుకు ఉరిశిక్ష పడినప్పుడు.. అతడిని రక్షించేందుకు ఆతిశీ కుటుంబం సుదీర్ఘకాలం పోరాడింది. అతడు అమాయకుడని, రాజకీయ కుట్రకు బలయ్యాడని చెబుతూ క్షమాభిక్ష ప్రసాదించాలని అప్పటి రాష్ట్రపతికి విజ్ఞప్తి కూడా చేసింది. ఇప్పుడు అతిశీ ‘డమ్మీ సీఎం’ అయినప్పటికీ ఆమె ఎంపిక .. దేశ భద్రతకు ఆందోళన కలిగించే అంశం. ఇక ఢిల్లీని దేవుడే కాపాడాలి.!’ అని స్వాతి మాలీవాల్ తన ‘ఎక్స్’లో పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com