Kerala CM Convoy : కేరళ సీఎం కాన్వాయ్ లో ప్రమాదం

Kerala CM Convoy : కేరళ సీఎం కాన్వాయ్ లో ప్రమాదం
X

కేరళ సీఎం పినరయి విజయన్ ఎస్కార్ట్ వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ అనూహ్య ఘటన కేరళ తిరువనంతపురంలోని వామనపురంలో జరిగింది. రోడ్డుపై కాన్వాయ్ వెళ్తుండగా ఎదురుగా స్కూటర్ వచ్చింది. ఊహించని ఈ పరిణామంతో సీఎం కాన్వా డ్రైవర్‌ సడన్‌గా బ్రేకులు వేశారు. దీంతో కాన్వాయ్‌లోని 5 కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముఖ్యమంత్రి వాహనం కూడా స్వల్పంగా దెబ్బతింది. అయితే, సీఎంకు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ఎలాంటి జాప్యం లేకుండా ముఖ్యమంత్రి తన ప్రయాణం కొనసాగించారు. సీఎం కాన్వాయ్‌కు చెందిన వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సేఫ్టీ ప్రోటాకాల్‌ను తిరిగి అమల్లోకి తెచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నారు.

Tags

Next Story