రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాలపై ADR సర్వే సంచలన వివరాలు

రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాలకు సంబంధించి ADR సర్వే సంచలన వివరాలు వెల్లడించింది. ఆ విరాళాల్లో ఎక్కువగా రహస్యంగా వచ్చినవేనని తెలిపింది. దేశవ్యాప్తంగా 27 ప్రాంతీయ పార్టీలకు పేరు చెప్పని వ్యక్తులు, సంస్థల నుంచి కోట్లకు కోట్లు విరాళాల రూపంలో అందు తున్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్ తెలిపింది.. ఈ విరాళాలు ప్రతి ఏటా పెరుగుతున్నాయని తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అందిన విరాళాల మొత్తం దాదాపు 887 కోట్లు అని తన రిపోర్ట్ లో తెలిపింది. ఇది మొత్తం విరాళాల్లో 76 శాతంగా ఉన్నట్టు తెలిపింది.
ఇక 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం 530 కోట్లు కాగా, దీనిలో 263 కోట్లు రహస్య విరాళాలు అంటే 49 శాతం గుప్త విరాళాలు ఉన్నట్టు తెలిపింది ఏడీఆర్ నివేదిక.20 వేల కంటే ఎక్కువగా విరాళాలు ఇచ్చిన వారి పేర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని. వీటిని ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించాయని తెలిపింది. అదేసమయంలో గుప్త విరాళాలకు సంబంధించిన లెక్కలను ఆడిట్ రిపోర్టులో పేర్కొన్నప్పటికీ వాటి వివరాలను మాత్రం పార్టీలు ఇవ్వలేదని ఏడీఆర్ పేర్కొంది.
దేశవ్యాప్తంగా 8 జాతీయ పార్టీలు, 27 ప్రాంతీయ పార్టీలను పరిగణనలోకి తీసుకొని ఏడీఆర్ ఈ సర్వే నిర్వహించింది.ఆయా పార్టీలు ఎన్నికల సంఘం వద్ద సమర్పించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు, డొనేషన్‌కు సంబంధించిన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపింది.ఇక 27 ప్రాంతీయ పార్టీల్లో.. బీఆర్‌ఎస్,వైసీపీతో పాటు..ఆప్,ఏజీపీ,ఏఐఐఏడీఎంకే, డీఎంకే, జీఎఫ్‌పీ, జేడీఎస్, జేడీయూ, జేఎంఎం, ఎంఎన్‌ఎస్, ఎన్‌డీపీపీ,శివసేన తదితర పార్టీలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com