DRDO : అగ్నిప్రైమ్ క్షిపణి పరీక్ష విజయవంతం

భారత్ విజయవంతంగా పరీక్షించింది. అగ్ని ప్రైమ్ తదుపరి తరం క్షిపణి. అనేక అత్యాధునిక సాంకేతికలను జోడించి రూపొందించిన ఈ క్షిపణి 2 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను... ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణిని రైలుపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన... మొబైల్ లాంచర్ నుంచి భారత రక్షణ, పరిశోధనా అభివృద్ధి సంస్థ-DRDO పరీక్షించింది. ఇలా రైలుపై మొబైల్ లాంచర్ ద్వారా క్షిపణి పరీక్ష చేయడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద రైలు నెట్ వర్క్ ద్వారా ఎక్కడికైనా సులభంగా తరలించే అవకాశం ఉంది. అతేకాకుండా అతి తక్కువ వెలుతురులోనూ, అతి స్వల్ప సమయంలోనూ..... అగ్నిప్రైమ్ క్షిపణిని ప్రయోగించవచ్చని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈ పరీక్షను విజయవంతం చేసేందుకు కృషి చేసిన..... D.R.D.O, స్ట్రాటజిక్ కమాండ్ ఫోర్స్ , సైనిక బలగాలు సహా ఇతర సంస్థలను..... రక్షణమంత్రి అభినందించారు. ఈ పరీక్ష విజయవంతం కావడంతో ఇలాంటి సామర్థ్యమున్న దేశాల సరసన భారత్ చేరిందని రాజ్ నాథ్ పేర్కొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com