Air India : రీజినల్ లాంగ్వేజెస్ లో ఎయిరిండియా కస్టమర్ కేర్

Air India : రీజినల్ లాంగ్వేజెస్ లో ఎయిరిండియా కస్టమర్ కేర్
X

ప్యాసింజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఎయిరిండియా సిద్ధమైంది.ఇప్పటివరకు హిందీ, ఇంగ్లీష్‌ భాషలకే పరిమితమైన కస్టమర్ కేర్ సేవలు.. తాజాగా మరో ఏడు ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని ఎయిరిండియా మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళం, పంజాబీ, మరాఠీ, మలయాళం, కన్నడ, బెంగాలీలో ఎయిరిండియా ఈ కస్టమర్‌ కేర్‌ సర్వీసులు తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక అసిస్టెంట్‌ సేవలు ఉదయం 8గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ప్రతి రోజూ అందుబాటులో ఉంటాయని ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. ఎయిరిండియా తాజాగా ఐదు కాంటాక్ట్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. తరచూ ప్రయాణించే వారు, ప్రీమియం కస్టమర్లకు ఈ సేవలు అన్నివేళలా అందుబాటులో ఉంటాయి. ‘ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టం.. కస్టమర్ల మొబైల్‌ నెట్‌వర్క్‌ ఆధారంగా వారి భాష ప్రాధాన్యతను ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. దీంతో భాషను ఎంచుకోవాల్సిన అవసరం ఉండదు’ఎయిర్‌లైన్స్‌ తెలిపింది.

Tags

Next Story