Ajit Pawar: విమానంలో ఉన్నది అజిత్ పవార్‌ను స్థానికులు ఎలా గుర్తు పట్టారు, కాపాడటానికి ఏం చేశారంటే ?

Ajit Pawar: విమానంలో ఉన్నది అజిత్ పవార్‌ను స్థానికులు ఎలా గుర్తు పట్టారు, కాపాడటానికి ఏం చేశారంటే ?
X
ల్యాండింగ్ చేస్తున్న సమయంలో కుప్పకూలిన విమానం

ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడం మహారాష్ట్రలో పెను విషాదం నింపింది. సాంకేతిక సమస్య కారణంగా బారామతి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు సిబ్బంది మృతి చెందారు. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడని ఎలా గుర్తించారో ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

గాగుల్స్, చేతివాచీ ఆధారంగా అజిత్ పవార్‌ను గుర్తించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వాటి ఆధారంగానే ప్రమాదానికి గురైంది ఉప ముఖ్యమంత్రి అని తెలుసుకున్నామని అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత నాలుగైదు పేలుడు శబ్ధాలు వినిపించినట్లు వారు చెప్పారు. తమ కళ్ల ముందే ప్రమాదం జరిగిందని, విమానం ఉన్నట్లుండి కిందకు వస్తుంటే అది కూలిపోయేలా ఉందని తమకు అనిపించిందని అన్నారు.

ఆ సమయంలో విమానం నుంచి శబ్ధం కూడా భిన్నంగా వచ్చినట్లు తెలిపారు. కాసేపటికే విమానం కుప్పకూలిందని, పెద్ద ఎత్తున మంటలు రావడంతో పాటు నాలుగైదు భారీ శబ్ధాలు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. తాము వెంటనే ప్రమాదస్థలానికి చేరుకుని, అందులో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశామని అన్నారు. రెండు మృతదేహాలు బయటకు ఎగిరిపడ్డాయని, ప్రమాదస్థాయి అంత తీవ్రంగా ఉందని అన్నారు.

ప్రమాద ఘటనపై డీజీసీఏ అధికారులు స్పందిస్తూ, ఇది ఎత్తైన కొండల ప్రాంతాల్లో ఉండే టేబుల్ టాప్ రన్‌వే అని, విమానం ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగానే రన్‌వే స్టార్టింగ్ పాయింట్‌లో ఇది కుప్పకూలిందని వెల్లడించారు.

Tags

Next Story