Amazon Great Indian Festival : సెప్టెంబర్ 27 నుంచి అమెజాన్ ఫెస్టివల్ సేల్

ప్రముఖ ఇ–-కామర్స్ సంస్థ అమెజాన్ దసరా, దీపావళి పండుగ వేళ నిర్వహించే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ డేట్ ను ప్రకటించింది. ఈ నెల 27 నుంచి ఈ సేల్ ను నిర్వహించనుంది. ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందే.. ఈ నెల 26 నుంచి సేల్ అందుబాటులోకి రానుంది. అమెజాన్ సేల్ లో ఎస్‌బీఐ కార్డు యూజర్లకు డిస్కౌంట్ లభించనుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుతో చేసే కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు పొందొచ్చు. అమెజాన్ పే యూపీఐతో చేసే రూ.1000పైన కొనుగోళ్లపై రూ.100 డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై 40 శాతం, ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం, హోమ్ డెకరేట్ ఐటమ్స్ పై 50 శాతం, ఫ్యాషన్ ప్రొడక్ట్స్ పై 50–-80 శాతం, అమెజాన్ అలెక్సా ప్రొడక్ట్స్ పై 55 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా రూ.5,999 నుంచే సెల్ ఫోన్లు అమ్మనున్నట్లు అమెజాన్ తెలిపింది. మొబైల్ యాక్సెసరీస్ రూ.89 నుంచే ప్రారంభమవుతాయని పేర్కొంది. 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. స్మార్ట్‌టీవీల ధరలు కూడా రూ.6,999 నుంచే ప్రారంభమవుతాయని తెలిపింది. అమెజాన్ అలెక్సా, ఫైర్‌టీవీ స్టిక్ డివైజులు రూ.1,999 నుంచి లభిస్తాయని పేర్కొంది. సేల్ సమయంలో ట్రావెల్ బుకింగ్‌లపైనా డిస్కౌంట్ పొందొచ్చని అమెజాన్ పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com