Anant Ambani : వందలాది కోళ్లను రక్షించిన అంబానీ కుమారుడు అనంత్

సంపన్నుడు ముఖేశ్ అంబానీ కుమారుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ అనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి ద్వారకకు పాదయాత్రగా వెళుతున్న టైంలో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఈ రెండు నగరాల మధ్య ఉన్న దూరం 140 కిలోమీటర్లు కాలినడక సాగిస్తున్నారు. ఏప్రిల్ 10న తన పుట్టిన రోజు నాటికి అనంత్ ద్వారకకు చేరుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. తన వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడకూడదనే ఉద్దేశంతో భారీ భద్రత మధ్య రాత్రివేళ పాదయాత్ర చేస్తున్నారు. కాగా, తన పాదయాత్రలో అనంత్ అంబానీ తాజాగా గొప్ప మనసు చాటుకున్నారు. వందలాది కోళ్లను ఆయన రక్షించారు. కంభాలియా ప్రాంతంలో ఓ కోళ్ల వ్యాన్‌ను చూసి చలించిపోయారు. వెంటనే ఆ కోళ్లను వదిలేయాలని, ఇందుకు తాను రెండు రెట్లు డబ్బులు చెల్లిస్తానని యజమానికి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు జంతువుల పట్ల అనంత్ అంబానీకి ఉన్న ప్రేమను కొనియాడుతున్నారు. కాగా, ద్వారకాధీశుడి ఆశీర్వాదం కోసమే తాను ఈ పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com