Hurun india report: అత్యంత విలువైన వ్యాపార కుటుంబం అంబానీదే

Hurun india report:  అత్యంత విలువైన వ్యాపార కుటుంబం అంబానీదే
X
హురున్ ఇండియా విడుదల చేసిన సర్వే వివరాలు

దేశీయ కార్పొరేట్ రంగంలోనే అంబానీ కుటుంబం అత్యంత విలువైన కుటుంబంగా నిలిచిందని బార్‌క్లేస్‌ ప్రైవేట్‌ క్లయింట్స్‌ హురున్‌ ఇండియా నివేదిక మరోసారి స్పష్టం చేసింది. భారత్‌లో వ్యాపారాలు నిర్వహిస్తున్న కుటుంబాల్లో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఫ్యామిలీనే అగ్రస్థానంలో నిలిచిందని తేల్చి చెప్పింది. 2024 ఏడాదిలో అంబానీ ఫ్యామిలీ భారత అత్యంత విలువైన వ్యాపార కుటుంబాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అంబానీ కుటుంబ ఆస్తుల విలువ రూ. 25.75 లక్షల కోట్లు కావడం విశేషం. అంబానీ కుటుంబ ఆస్తులు దేశ జీడీపీలో 10 శాతం. అంటే అంబానీ ఆస్తులు ఎంత ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

అత్యంత ధనవంతులైన వ్యాపారుల జాబితాలో అంబానీల తర్వాత బజాజ్, బిర్లా కుటుంబాలు ఉన్నాయి. అంబానీ కుటుంబ సంపద రూ. 25,75,100 కోట్లు కాగా.. నీరజ్ బజాజ్ కుటుంబం ఆస్తుల విలువ రూ. 7,12,700 కోట్లు. కుమార్ మంగళం బిర్లా కుటుంబం ఆస్తుల విలువ రూ. 5,38,500 కోట్లు. గౌతమ్ అదానీ కుటుంబ ఆస్తుల విలువ రూ. 15,44,500 కోట్లు. అయితే ఆదానీ ఫస్ట్‌ జనరేషన్‌ ఫ్యామిలీ కావడంతో ఆదానీకి ఈ జాబితాలో చోటు దక్కలేదు. ఈ మొదటి తరం కుటుంబాల జాబితాలో అదానీ కుటుంబం టాప్‌లో నిలవగా... రెండో స్థానంలో సీరమ్ కుటుంబం నిలిచింది.

హురున్ ఇండియా నివేదిక

అంబానీ, బజాజ్‌, బిర్లా కుటుంబాల తర్వాత అత్యంత విలువైన వ్యాపార కుటుంబాలు ఇలా ఉన్నాయి.

జిందాల్ కుటుంబం: ,రూ. 4.71 లక్షల కోట్లు

నాడార్ ఫ్యామిలీ: రూ. 4.30 లక్షల కోట్లు

మహీంద్రా కుటుంబం: రూ. 3.45 లక్షల కోట్లు

డానీ, చోక్సీ, వకిల్ కుటుంబం: రూ. 2.71 లక్షల కోట్లు

ప్రేమ్ జీ కుటుంబం : రూ. 2.57 లక్షల కోట్లు

రాజీవ్ సింగ్ కుటుంబం: రూ. 2.04 లక్షల కోట్లు

మురుగప్ప కుటుంబం: రూ. 2.02 లక్షల కోట్లు

Tags

Next Story