Waqf Law : ఆస్తుల పరిరక్షణకే వక్స్ చట్ట సవరణ

Waqf Law : ఆస్తుల పరిరక్షణకే వక్స్ చట్ట సవరణ
X

ఆస్తుల పరిరక్షణ కోసమే వర్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఈ బిల్లుతో ముస్లింలు భయ పడాల్సిందేమి లేదని స్పష్టం చేశారు. విపక్షాల నిరసనల మధ్య ఆయన ఇవాళ వర్ఫ్ బోర్డు సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. సభ్యుల నిరసనల మధ్యనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. 'బిల్లుపై విస్తృత చర్చలు జరిపాం. అన్ని వర్గాల నుంచి సలహాలు తీసుకున్నాం. విపక్షాలు మైనారి టీల్లో అనవసర భయాలు సృష్టిస్తున్నాయి. మత విశ్వాసాల్లో కేంద్రం జోక్యం చేసుకోదు. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం వర్ఫ్ ఆస్తుల పరి రక్షణ మాత్రమే' అని అన్నారు. 2013లో కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, అప్పటి యూపీఏ ప్రభుత్వం సుమారు 30 విలువైన ఆస్తులను ఢిల్లీ వర్ఫ్ బోర్డుకు బదిలీ చేసిందన్నారు. పార్లమెంట్ భవనం మాదే అన్నారు: మంత్రి పార్లమెంట్ భవనం కూడా తమదేనని వర్ఫ్ బోర్డు చెప్పిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. వకో బోర్డుభూములకు సంబంధించి గతంతో అల హాబాద్ హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులను చదివి వినిపించారు. కొత్తగా తెస్తున్న చట్టం ప్రకారం వర్ఫ్ బోర్డులో షియాలు, సున్నీలు, బోరాలు, ముస్లింలలోని అత్యంత వెనుకబడిన వర్గాల వారితో పాటు మహిళలు కూడా ఉంటారని చెప్పారు. అంతే కాకుండా నలుగురు ముస్లిమేతర సభ్యులు వక్స్ కౌన్సిల్ లో ఉంటారన్న మంత్రి వారిలోనూ ఇద్దరు మహిళలు ఉంటారని చెప్పారు.

Tags

Next Story