PM Modi : 2029లోనూ ప్రధాని అభ్యర్థి మోడీనే.. అమిత్ షా సంచలనం

PM Modi : 2029లోనూ ప్రధాని అభ్యర్థి మోడీనే.. అమిత్ షా సంచలనం
X

2029 లోక్సభ ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమే అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత పదవీ కాలాన్ని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవతంగా పూర్తి చేస్తామన్నారు. చండీగఢ్ లోని మణిమజ్రాలో నీటి సరఫరా ప్రాజెక్టును అమిత్ షా ప్రారంభించారు.

'ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా బీజేపీ నేతలు ఆందోళన చెందకండి. ఎందుకంటే 2029లో కూడా మనమే అధికారంలోకి వస్తున్నాం. ఎన్డీయే తిరిగి నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మళ్లీ మోడీనే ( Narendra Modi ) ప్రధాన మంత్రి అవుతారు. ఈ విషయంపై స్పష్టమైన హామీ ఇస్తున్నా" అని చెప్పారు. ఏదో కొంత విజయం దక్కడంతో తాము ఎంతో విజయం సాధించామని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని, అయితే మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన సీట్లకంటే 2021 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించిందన్న విషయం వారికి తెలియడం లేదన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువ రోజులు నడవదని చెప్తున్న వారు.. దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు అమిత్ షా. తమ ప్రభుత్వం ఐదేళ్ల అధికారాన్ని పూర్తి చేసుకుంటుందని, తదుపరి అధికారం కూడా తమదేనని ప్రతిపక్ష మిత్రులకు చెప్పాలను కుంటున్నానని అమిత్ షా అన్నారు. ప్రతిపక్షం తమ రోల్ ను కూడా సమర్థంగా పోషించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.

Tags

Next Story