Amit Shah : దేశ వ్యతిరేక ప్రకటనలు రాహుల్ కు అలవాటే : అమిత్ షా
అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రాహుల్ పై మండిపడ్డారు. దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతోన్న శక్తులకు అండగా నిలబడటం రాహుల్‌కు, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.‘దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం, దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్, కాంగ్రెస్‌కు అలవాటుగా మారింది. జమ్ముకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన దేశవ్యతిరేక, రిజర్వేషన్ల వ్యతిరేక అజెండాకు మద్దతు ఇవ్వడమైనా సరే, విదేశీ గడ్డపై భారత్ వ్యతిరేక ప్రకటనలైనా సరే.. ఆయన ప్రతిసారీ దేశ భద్రతను ముప్పులో పడేస్తున్నారు. మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ప్రాంతీయవాదం, మతం, భాష పరంగా చీలికలు తెచ్చే కాంగ్రెస్ రాజకీయాలను రాహుల్ ప్రకటన బయటపెట్టింది. రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడి.. వాటిపై కాంగ్రెస్ వ్యతిరేకతను మరోసారి మనముందుంచారు. ఆయన మనసులో మెదిలే ఆలోచనలే చివరకు మాటల రూపంలో బయటపడ్డాయి. ఇక్కడ నేను రాహుల్‌కు ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా. బీజేపీ ఉన్నంతకాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు. అలాగే దేశభద్రతతో ఆటలాడలేరు’అని అమిత్ షా హెచ్చరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com