Jharkhand : రాంచీలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోను కేంద్రహోం మంత్రి అమిత్‌షా రాంచీలో విడుదల చేశారు. సంకల్ప్ పత్ర పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో పలు వరాల జల్లు కురుపించారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని స్పష్టం చేశారు. గోగో దీదీ స్కీమ్ కింద మహిళలకు నెలకు 2100 రూపాయల నగదు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి 25 ఏళ్లు పూర్తయినందున రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన 25 ముఖ్యమైన అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. 21 లక్షల కుటంబాలకు ఇళ్ల నిర్మాణం, ఇంటింటికి మంచి నీటి కనెక్షన్ ఇస్తామన్నారు. రెండు సంవత్సరాల పాటు నిరుద్యోగ యువతకు 2వేల భృతి ఇస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. లక్ష్మీ జోహార్ యోజన కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, సంవత్సరానికి రెండు ఉచిత సిలిండర్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతి నుంచి గిరిజనులకు మినహాయింపు ఇస్తామని అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com