Maharashtra: పోలింగ్ కేంద్రంలో గుండెపోటుతో స్వతంత్ర అభ్యర్థి మృతి..

మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఓటింగ్ జరగగా, బీడ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బీడు అసెంబ్లీ స్థానంలో ఓటింగ్ సందర్భంగా ఓ స్వతంత్ర అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందారు. స్వతంత్ర అభ్యర్థి పేరు బాలాసాహెబ్ షిండే. అభ్యర్థి మృతితో కార్యకర్తల్లో తీవ్ర దిగ్భ్రాంతికి గురై ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాలాసాహెబ్ షిండే.. బీడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఓటింగ్ రోజున ఆయన బీడ్ నగరంలోని ఛత్రపతి షాహూ విద్యాలయంలోని ఈ పోలింగ్ బూత్‌లో ఉన్నారు
ఇంతలో తల తిరగడంతో కింద పడిపోయారు. దీంతో అక్కడున్న కార్యకర్తలు ఆయనను బీడ్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రైవేట్ ఆస్పత్రి ఆయనను ఛత్రపతి శంభాజీ నగర్‌లోని ఓ మరో ఆస్పత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మహారాష్ట్రలోని ఓ పోలింగ్ బూత్‌లో బుధవారం బీడ్‌కు చెందిన స్వతంత్ర అభ్యర్థి ఓటు వేసేందుకు వేచి ఉండగా గుండెపోటుకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం.. ఎన్నికల సమయంలో అభ్యర్థి మరణిస్తే, సెక్షన్ 52 ప్రకారం సంబంధిత సీటుపై ఓటింగ్‌ను వాయిదా వేయవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com