Chhattisgarh : ఛత్తీస్గఢ్ లో మరో ఎన్ కౌంటర్ .. మావోయిస్టు రేణుక మృతి

Chhattisgarh : ఛత్తీస్గఢ్ లో మరో ఎన్ కౌంటర్ .. మావోయిస్టు రేణుక మృతి
X

ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. దంతేవాడ జిల్లాలో ఇవాళ భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకా ల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఆమెను రేణుక అలియాస్ చైతు అలియాస్ సరస్వతిగా గుర్తించారు. రేణుకది ఉమ్మడి వరంగల్ జిల్లా కడవెండి గ్రామం. మృతురాలు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలిగా పనిచేసిందని, ఆమె తలపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. తిరుపతిలో ఎల్ఎల్ బీ పూర్తి చేసిన రేణుక అక్కడే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. మావోయిస్టు పార్టీ అనుబంధ మహిళా సంఘంలో పనిచేస్తూ చంద్రబాబు అలిపిరి దాడి అనంతరం అండర్ గ్రౌండ్ లోకి వెళ్లింది. పార్టీలోనే ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డిని వివాహం చేసుకుంది. సంతోష్ ఎన్ కౌంటర్ తర్వాత శాఖమూరి అప్పారావు సహచరిగా కొనసాగారు. రేణుక తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆమెకు ఇద్దరు సో దరులున్నారు. ఒక సోదరుడు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తుండగా.. మరో సోదరుడు ఢిల్లీలో జర్నలిస్టుగా ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 135 మంది మృతి ఆపరేషన్ కగార్ లో భాగంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 135 మంది మావోయిస్టులను హతమార్చినట్లు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పోలీసు ఉన్నతాధికారుల కథనం ప్రకారం.. దంతెవాడ, బీజాపుర్ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో డీఆర్డీ సిబ్బంది యాంటీ-నక్సలైట్ ఆపరేషన్ చేపట్టారు. ఈక్రమంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడగా.. భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఎన్ కౌంటర్ అనంతరం ఘటనాస్థలంలో రేణుక మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీఎత్తున తుపాకులు, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

Tags

Next Story