App : రోడ్లపై గుంతల గుర్తింపునకు యాప్
రోడ్లపై గుంతలను గుర్తించడం, మరమ్మతులు చేపట్టడం కోసం ఓ యాప్‌ను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. గుంత ఉన్న ప్రదేశాన్ని ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తే ప్రభుత్వం స్పందించి మరమ్మతులు చేపడుతుంది. ఒకవేళ పనులు ఆలస్యమైతే కారణాలను పొందుపరుస్తుంది. కర్ణాటకలో అమల్లో ఉన్న దీనిని తొలుత GHMCలో, తర్వాత మున్సిపాలిటీల్లో అమలు చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.
కర్ణాటక ప్రభుత్వం ఒక యాప్‌ను తీసుకొచ్చింది. గుంత ఉన్న ప్రదేశాన్ని ఫొటో తీసి అందులో అప్‌లోడ్ చేస్తే సంబంధిత శాఖ మరమ్మతుకు చర్యలు తీసుకుంటుంది. ఒక వేళ ఆ పనులు ఆలస్యమైతే.. కారణాలను పొందుపర్చేలా యాప్‌ను రూపొందించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోనూ మరింత పకడ్బందీగా యాప్‌ను రూపొందించాలని ఆర్‌అండ్‌బీ అఽధికారులు నిర్ణయించారు.
గుంత ఉన్న ఫొటోను యాప్‌లో అప్‌లోడ్ చేయగానే గుంత ఉన్న ప్రాంతం, అది ఏ అధికారి పరిధిలోకి వస్తుంది, ఆ రహదారి పూర్తి వివరాలు వెంటనే డిస్‌ప్లే అయ్యేలా యాప్ ను రూపొందించనున్నారు. గూగుల్ మ్యాప్ ఆధారంగా యాప్‌ను తీర్చిదిద్దనున్నారు. పనులు పూర్తయ్యాక సదరు కాంట్రాక్టర్లు బిల్లుల కోసం తిరిగే పని లేకుండా.. యాప్‌లో వివరాలు పొందుపర్చగానే చెల్లించేందుకు వీలవుతుందా? లేదా? అని కసరత్తు చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com