Padma Awards : పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

వివిధ రంగాల్లో సేవలందించిన ప్రతిభావంతులకు ప్రదానం చేసే దేశ అత్యున్నత పౌర పురస్కారాలు 'పద్మ' అవార్డ్స్ కోసం కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ అవార్డుల కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించింది. ఆసక్తి ఉన్నవారు జులై 31 లోగా నామినేషన్లు, సిఫార్సులు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోని రెండు అత్యున్నత పౌరపురస్కారాలైన భారతరత్న, పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం 1954లో ప్రారంభించింది. భారత్తో పాటు వివిధ దేశాలకు చెందిన వారికి సైతం అవార్డులను కేంద్రం ప్రకటిస్తుంది. వివిధ రంగాల్లో ప్రతిష్ఠాత్మక, అసాధారణ సేవలు అందించినందుకు అవార్డులతో సత్కరిస్తుంది. ఈ అవార్డులను ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తుండగా.. మార్చి, ఏప్రిల్లో రాష్ట్ర పతి చేతులమీదుగా అందజేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com