Jammu & Kashmir : చీనాబ్ రైల్వే బ్రిడ్జిపై ఆర్మీ మాక్ డ్రిల్

Jammu & Kashmir : చీనాబ్ రైల్వే బ్రిడ్జిపై ఆర్మీ మాక్ డ్రిల్
X

జమ్ము-కాశ్మీర్ లోని చినాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్ నిర్మించారు. దీనిపై మంగళవారం భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. విపత్తులవేళ సన్నద్ధతకు సంబంధించి ఈ డ్రిలను చేపట్టారు. ఈ బ్రిడ్జ్ ప్రస్తుతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈఫిల్ టవర్ కన్నా ఎత్తులో ఉన్న ఆ బ్రిడ్జిపై భద్రతా దళాలు నిత్యం పహారా కాస్తున్నాయి. రియాసి జిల్లాకు చెందిన పోలీసులతో పాటు ఎస్వోజీ, సీఆర్పీఎఫ్, 126బీఎన్, జీ ఆర్పీ, ఆర్పీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, వీడీజీ, సివిల్ అడ్మినిస్ట్రేషన్, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ, మెడికల్ బృందాలు కూడా మాక్ డ్రిల్లో పాల్గొన్నాయి. చినాబ్ నదిపై సుమారు 350 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ బ్రిడ్జ్ ను రక్షించుకునేందుకు అన్ని శాఖలు సిద్ధంగా ఉన్నాయి. అద్భుతమైన ఇంజినీరింగ్ నైపుణ్యంతో నిర్మించిన ఈ బ్రిడ్జకు ఎటువంటి ప్రమాదం వచ్చినా, దాన్ని ఎదుర్కోనే రీతిలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాయి.

Tags

Next Story