Kerala Court : బాబా రామ్‌దేవ్‌పై అరెస్ట్ వారెంట్

బాబా రామ్ దేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై కేరళ కోర్టు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీ తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో అరెస్ట్ చేయాలని ఆదేశించింది. మందులు, వ్యాధుల నివారణపై దివ్య ఫార్మసీ తప్పుడు ప్రకటనలు ఇస్తున్నట్లు ఆ రాష్ట్రంలో పలు కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి కోర్టు ముందు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
దివ్య ఫార్మసీ తప్పుడు ఆరోగ్య ప్రకటనల వల్ల కేరళ రాష్ట్రంలో పలు కేసులు నమోదు చేయడానికి కారణమయ్యాయి.ఈ కేసుకు సంబంధించి బాబా రామ్‌దేవ్, బాలకృష్ణ కోర్టు ముందుకు హాజరుకాకపోవడంతో, కోర్టు వారిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. మూడేళ్ల క్రితం కేరళ రాష్ట్రానికి చెందిన ఆఫ్తమాలజిస్ట్ వైద్యుడు కేవీ బాబు ఈ ఫిర్యాదుతో కేరళలో పది కేసులు, ఉత్తరాఖండ్‌లో ఒక కేసు నమోదయ్యాయి.
పతంజలికి సంబంధించిన కార్యాలయాన్నింటికీ ఆదేశాలు జారీ చేసింది. అలాగే 1954 డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ (అభ్యంతకర యాడ్స్) చట్టాన్ని ఉల్లంఘించినందుకు పతంజలిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. ఇదిలాఉండగా పతంజలి ఆయుర్వేద ప్రొడక్ట్స్ బీపీ, షుగర్ లాంటి వ్యాధులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను నయం చేస్తాయని గతంలో యాడ్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టు కూడా వీళ్లకు మొట్టికాయలు వేసింది. తప్పుడు ప్రకటనలు చేసినందుకు క్షమాపణలు చెబుతూ యాడ్ ఇవ్వాలంటూ ఆదేశించింది. అయితే తాజాగా పాలక్కడ్ జిల్లా కోర్టు బాబా రామ్‌దేవ్, బాలకృష్ణపై అరెస్టు వారెంట్ జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com