ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు ట్రక్కు ఢీ.. 14 మంది మృతి, 27 మందికి గాయాలు

ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు ట్రక్కు ఢీ.. 14 మంది మృతి, 27 మందికి గాయాలు
బుధవారం ఉదయం అస్సాంలోని డెర్గావ్‌లో 45 మందితో వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో 14 మంది మృతి చెందగా, 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

బుధవారం ఉదయం అస్సాంలోని డెర్గావ్‌లో 45 మందితో వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో 14 మంది మృతి చెందగా, 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అస్సాంలోని డెర్గావ్‌లో బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు 45 మందితో వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో కనీసం 14 మంది మరణించారు. 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.

45 మంది ప్రయాణికులతో బస్సు తిన్సుకియాలోని తిలింగ మందిర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. దేర్గావ్‌లో ట్రక్కును ఢీకొట్టింది. పిక్నిక్ పార్టీకి అని తెల్లవారుజామున 3 గంటలకు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు డెర్గావ్ వాసులు. వారు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి మరెంతో దూరం లేదు. ఈ లోపే మృత్యువు ట్రక్కు రూపంలో ముంచుకొచ్చింది. మార్గరీటా నుండి బొగ్గుతో నిండి ఉన్న ట్రక్కు బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన ప్రయాణికులను రక్షించి జోర్హాట్ మెడికల్ కాలేజీకి తరలించారు. గాయపడిన వారిలోని పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఓ అధికారి తెలిపారు. మృతి చెందిన 14 మంది ప్రయాణికుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మాస్టమ్ పరీక్షలకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story