Atishi: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణం

Atishi: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణం
X

దేశ రాజధాని ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం రాజ్‌ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, ఆప్ నేతలు, తదితరులు హాజరయ్యారు. ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా అతిషి రికార్డు సృష్టించారు. అతిషితో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రులుగా సౌరవ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేష్ అలావత్ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఢిల్లీ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కాగా, కేజ్రీవాల్ కేబినెట్‌లో అత్యంత ప్రభావంతమైన మంత్రిగా అతిషి ఉన్నారు. అతిషికి విద్య, పబ్లిక్ వర్క్స్, రెవెన్యూ, వాటర్, ఫైనాన్స్, ప్లానింగ్ వంటి భారీ శాఖలను సీఎం కేజ్రీవాల్ అప్పగించారు. తొలిసారి మంత్రిగా పనిచేసిన ఆమె అనూహ్యంగా ఇప్పుడు ఢిల్లీ సీఎం అయ్యారు. లిక్కర్ పాలసీ కేసులో సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదల అయిన కేజ్రీవాల్.. రెండు రోజుల తర్వాత సీఎంగా రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలసిందే. ఆ తర్వాత రాష్ట్ర శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి, ఢిల్లీ కొత్త సీఎంగా అతిశీని ప్రకటించారు. ఆతర్వాత ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు.

Tags

Next Story