Bank Holidays : ఆగస్టులో బ్యాంకులకు 13 రోజులు సెలవులు
బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సదరు బ్యాంకు శాఖ తెరిచి ఉంటుందా..? లేక సెలవు పెట్టాలా? అనేది తెలుసుకోవాల్సిందే. గురువారం నుంచి ఆగస్టు నెల ప్రారంభం అవుతోంది. వచ్చే నెలలో ఐదు ఆదివారాలు, రెండు శనివారాలు కలిపి మరో ఆరు రోజులకు బ్యాంకులకు జాతీయ సెలవు. ఇవి కాకుండా మరో ఏడు రోజులు దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో సెలవులు ఉన్నాయి.. ఆ సెలవుల గురించి ముందస్తుగా బ్యాంకులు సమాచారం ఇస్తాయి. అవేంటో ఓసారి చూద్దాం.
పంద్రాగస్టు, రాఖీపౌర్ణమి, జన్మాష్టమి సహా.. రాష్ట్రాలను బట్టి ఆప్షనల్ హాలీడేస్ పెరగనున్నాయి. ఆగస్టు 26న సోమవారం జన్మాష్టమి సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించింది ఆర్బీఐ. ఆగస్టు 24న నాలుగో శనివారం, 25న ఆదివారం తర్వాత సోమవారం కూడా సెలవు కావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవు. గుజరాత్, ఒడిశా, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, జమ్ము, ఉత్తరప్రదేశ్, బెంగాల్, బీహార్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్ మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్ పరిధిలో ఆగస్టు 24, 25, 26 తేదీల్లో వరుసగా బ్యాంకులకు సెలవు ప్రకటించింది ఆర్బీఐ.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com