Delhi : స్కూళ్లలో విద్యార్థుల ఫోన్ వినియోగంపై నిషేధం సాధ్యం కాదు: ఢిల్లీ హైకోర్టు

పాఠశాలల్లో విద్యార్ధినీ, విద్యార్ధులు స్మార్ట్ ఫోన్లను వినియోగించడాన్ని పూర్తిగా నిషేధించడం ఆచరణ సాధ్యంకాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అనూప్ బంబానీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై దాఖలైన పిటిషన్పై ఈ వ్యాఖ్యలను చేసింది. స్మార్ట్ ఫోన్లను స్కూల్స్కి తీసుకుని రావడం, వాటిని విని యోగించడం అనేది ఒక అలవాటుగా మారిందనీ, దానిని పూర్తిగా నిషేధించడం సాధ్యం కాదనీ,అయితే,కొన్ని పరిమితులు విధించవచ్చని పేర్కొంది. పాఠశాలల్లో సాంకేతిక పరమైన సౌకర్యాలను వినియోగించుకోవడం తప్పులేదనీ, వారి భవిష్య త్ రీత్యా వాటిని పూర్తిగా నిషేధించడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యార్ధుల మధ్య విద్యార్ధులు. ఉపాధ్యాయులు, తల్లితండ్రుల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు స్మార్ట్ ఫోన్ వినియోగం అవసరమేనని బెంచ్ స్పష్టం చేసింది. కేంద్రీయ విద్యాలయ (ద్వారక) విద్యార్ధిఒకరు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ, స్మార్ట్ ఫోన్లను విద్యార్థులు దుర్వినియోగం చేస్తున్నారని, వాటిని పూర్తిగా నిషేధిం చాలని కోరారు. డిజిటల్ విద్య ద్వారా విద్యార్ధులను బాధ్యతా యుతమైన పౌరులు గా తీర్చిదిద్దేందుకు వీలుందని బెంచ్ పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com