Indian Army : భారత్ వైపు బంగ్లా ఎయిర్ క్రాఫ్ట్.. యుద్ధ విమానం దింపిన ఇండియన్ ఆర్మీ
పొరుగు దేశం బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో భారత గగనతలంలోకి ఆ దేశానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ప్రవేశించడం తీవ్ర కలకలం రేపుతుంది. బంగ్లాదేశ్ వాయుసేనకు చెందిన సీ-130 ఎయిర్ క్రాఫ్ట్ భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలర్ట్ అయింది. పరిస్థితిని పరిశీలించేందుకు వాయుసేనకు చెందిన ఓ యుద్ధ విమానాన్ని పంపించింది.
ఈ యుద్ధ విమానం.. బంగ్లాదేశ్ ఎయిర్ క్రాఫ్ట్ తిరిగి ఆ దేశ ఎయిర్ స్పేస్ లోకి వెళ్లే వరకు ఓ కన్నేసి ఉంచినట్లు చెప్పారు. బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత్లో ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత వాయుసేన వర్గాలు వెల్లడించాయి.
రిజర్వే షన్ల అమలు కోసం బంగ్లాదేశ్ అంతటా చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిపోవడంతో.. ప్రధాన మంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. పాలనా పగ్గాలను అక్కడి ఆర్మీ చేపట్టింది. ప్రస్తుతం బంగ్లా దేశానికి విమాన సేవలతో పాటు రైల్వే సేవలను కూడా భారత ప్రభుత్వం నిలిపివేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com