NIA :మానవ అక్రమ రవాణా కేసులపై ఉక్కు పాదం

NIA :మానవ అక్రమ రవాణా కేసులపై ఉక్కు పాదం
10 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

మానవ అక్రమ రవాణ వ్యవహారంలో దేశవ్యాప్తంగా సోదాలు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ-NIA. 44 మందిని పట్టుకున్నట్లు ప్రకటించింది. ఈ ఉదయం నుంచి పది రాష్ట్రాల్లో 55 చోట్ల సోదాలు చేసిన ని, 5 రాష్ట్రాలలో ఐదు హ్యూమన్ ట్రాఫికింగ్ మాడ్యూల్స్ ని చేధించింది.

భారత్ -బంగ్లాదేశ్ సరిహద్దుల ద్వారా అక్రమ వలసదారుల చొరబాటు, వారికి దేశంలో ఆశ్రయం కల్పించే నెట్ వర్క్ ను విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ జరిపినట్లు NIA పేర్కొంది. ఏకకాలంలో చేసిన సోదాల్లో మొబైల్ ఫోన్ లు, SIM కార్డ్ లు, పెన్ డ్రైవ్ లు, డిజిటల్ పరికరాలు, ఆధార్, పాన్ వంటి నకిలీ గుర్తింపు పత్రాలు20 లక్షల భారతీయ కరెన్సీ, 4550 అమెరికన్ డాలర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.దర్యాప్తులో బయటపడిన వివరాలకు అనుగుణంగా 3 కొత్త కేసులు నమోదు చేసినట్లు ప్రకటించింది. త్రిపురలో 21 మంది, కర్ణాటక 10, అస్సాం ఐదు, పశ్చిమ బెంగాల్ ముగ్గురు, తమిళనాడు ఇద్దరు, పుదుచ్చెరి, తెలంగాణ, హరియాణాల్లో ఒక్కొక్కరు చొప్పున 44 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది.

దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. మానవ అక్రమ రవాణా కేసులకు సంబంధించి మొత్తం 10 రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, హర్యానా, పుదుచ్చేరి, రాజస్థాన్,జమ్మూ అండ్ కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ సోదాలు జరుపుతోంది. ఆయా రాష్ట్రాల్లోని పోలీసులను సమన్వయం చేసుకుంటు ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానితుల నివాసాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అంతర్జాతీయ సంబంధాలు కలిగి ఉన్న మానవ అక్రమ రవాణా రాకెట్ ను వెలికి తీసేందుకు 10 రాష్ట్రాల్లో దాదాపు 50 ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కెనడాకు వలస వెళ్లేందుక చట్టపరమైన డాక్యుమెంటేషన్ ను పొందటం. ఉపాధి అవకాశాలతో పాటు ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని అమాయక ప్రజలను నమ్మించి అక్రమంగా తరలిస్తున్న ముఠాలపై ఎన్ఐఏ దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు.

కాగా..గత నెలలో పరారీలో ఉన్న నిందితుడు ఇమ్రాన్ ఖాన్ ను బెంగళూరుకు చెందిన ఎన్‌ఐఏ బృందం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. శ్రీలంక మానవ అక్రమ రవాణా కేసులో తమిళనాడు నుంచి పరారీలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను బెంగళూరు NIA అధికారులు అరెస్ట్ చేశారు.శ్రీలంకకు చెందినవారిని ఇమ్రాన్ ఖాన్ గ్యాంగ్ బెంగళూరు, మంగళూరులోని పలు ప్రాంతాలకు అక్రమ రవాణా చేయటంతో ఇమ్రాన్ ను అరెస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story