Joe Biden : భారత్‌కు జో బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనదేశంలో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ విషయంపై అమెరికా వైట్‌హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ ఒక ప్రకటన విడుదల చేశారు. జీ20 20 దేశాల మధ్య జరిగే శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సెప్టెంబర్ 7 నుంచి 10వ తేదీల్లో భారత్‌లో పర్యటిస్తారన్నది దీని సారాంశం. ఈ సందర్భంగా ఆయన భారత్‌తో ద్వైపాక్షిక సమావేశాలను కూడా జరుపుతారని సల్లివన్ తెలిపారు.
జీ20 సమ్మిట్‌లో బైడెన్ బ్యాంకుల ఆధునీకరణ డెవలప్‌మెంట్‌పై ప్రధానంగా చర్చిస్తారని సల్లివన్ వెల్లడించారు. ప్రత్యేకించి స్వచ్ఛ ఇంధన పరిణామం, వాతావరణ మార్పుల సంక్లిష్టతలపై విశ్లేషిస్తారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల తలెత్తిన ఆర్థిక, సామాజిక దుష్పలితాలపై ఈ వేదిక సందర్భంగా సరైన విధంగా నిరసన వ్యక్తం చేసేందుకు బైడెన్ సంకల్పించినట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.
ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే సదస్సు జీ20. ఈసారి ఈ హై ప్రొఫైల్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. దీనికి సంబంధించిన కోలాహలం దేశంలో నెలకొంది. సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఈ సమ్మిట్‌ను నిర్వహించబోతోంది భారత్. ఈ సమావేశానికి 29 దేశాల అధినేతలతో పాటు ఐరోపా సమాఖ్య, ఆహ్వానిత అతిథి దేశాలు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 8-10 తేదీలను ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించే ప్రతిపాదనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమోదం తెలిపారు. దీని ప్రకారం బ్యాంకులు, వాణిజ్య సంస్థలు, మార్కెట్లు సహా అన్ని ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు 3 రోజులు మూసివేయనున్నారు.G-20 అధ్యక్ష బాధ్యతల్ని 2022 డిసెంబర్ 1న ఇండోనేసియా నుంచి భారత్ స్వీకరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com